హౌస్‌బోటులో మంటలు.. నీటిలో దూకిన పర్యాటకులు..!

| Edited By:

Jan 24, 2020 | 9:06 PM

కేరళాలోని వేంబనాడ్ సరస్సులోని పాతిరామనల్ ద్వీపం సమీపంలో మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో  పర్యాటకులతో వెళ్తున్న ఓ హౌస్‌బోటు ప్రమాదంలో చిక్కుకుంది. బోటులో ఒక్కసారి మంటలు ఏర్పడటంతో పర్యాటకులు నీటిలోకి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బోటులో13 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో సహా 16 మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు ఏర్పడిన ప్రాంతంలో నీళ్లు ఐదు అడుగుల లోతు మాత్రమే ఉండటంతో పర్యాటకులు తప్పించుకోవడం సులభమైంది. లేకుంటే నీటిలో […]

హౌస్‌బోటులో మంటలు.. నీటిలో దూకిన పర్యాటకులు..!
Follow us on

కేరళాలోని వేంబనాడ్ సరస్సులోని పాతిరామనల్ ద్వీపం సమీపంలో మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో  పర్యాటకులతో వెళ్తున్న ఓ హౌస్‌బోటు ప్రమాదంలో చిక్కుకుంది. బోటులో ఒక్కసారి మంటలు ఏర్పడటంతో పర్యాటకులు నీటిలోకి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. ప్రమాద సమయంలో బోటులో13 మంది పర్యాటకులు, ముగ్గురు సిబ్బందితో సహా 16 మంది పర్యాటకులు ఉన్నారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మంటలు ఏర్పడిన ప్రాంతంలో నీళ్లు ఐదు అడుగుల లోతు మాత్రమే ఉండటంతో పర్యాటకులు తప్పించుకోవడం సులభమైంది. లేకుంటే నీటిలో మునిగి ప్రాణ నష్టం జరిగేది. తప్పనిసరి లైసెన్సులు లేకుండా హౌస్‌బోట్ పనిచేస్తున్నట్లు పొలిసు వర్గాలు తెలిపాయి.

ఈ సంఘటనపై పోర్టింగ్ విభాగం, లైసెన్సింగ్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించింది. “మేము దర్యాప్తు ప్రారంభించాము. ఈ సంఘటనకు గల కారణాన్ని మేము ఇంకా నిర్ధారించలేదు. ఎల్‌పిజి లీక్ లేదా షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు సంభవించి ఉండవచ్చు ”అని అలప్పుజ పోర్టు అధికారి కెప్టెన్ హరి అచుతా వారియర్ తెలిపారు.

[svt-event date=”24/01/2020,8:57PM” class=”svt-cd-green” ]