డాక్టర్లు అలా ప్లాన్ చేశారు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్

| Edited By: Anil kumar poka

May 03, 2020 | 10:42 AM

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. తను కరోనా వ్యాధికి ఎలా గురైందీ, ఆసుపత్రిలో తనకు ఎలాంటి చికిత్స లభించిందీ అన్నింటినీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తనను ఐసీయులో చేర్చిన అనంతరం.. ఒకవేళ తను మరణిస్తే ఆ విషయాన్ని ఎలా ప్రకటించాలా అని డాక్టర్లు ప్లాన్ చేశారని ఆయన తెలిపారు...

డాక్టర్లు అలా ప్లాన్ చేశారు.. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్
Follow us on

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. తను కరోనా వ్యాధికి ఎలా గురైందీ, ఆసుపత్రిలో తనకు ఎలాంటి చికిత్స లభించిందీ అన్నింటినీ తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. తనను ఐసీయులో చేర్చిన అనంతరం.. ఒకవేళ తను మరణిస్తే ఆ విషయాన్ని ఎలా ప్రకటించాలా అని డాక్టర్లు ప్లాన్ చేశారని ఆయన తెలిపారు. వారికి ఓ వ్యూహమంటూ ఉన్నట్టు తెలుసుకున్నానని, తను మరణిస్తే దాన్ని ‘స్టాలిన్ టైప్’ మృతితో పోల్చాలని వారు భావించారని ఆయన చెప్పారు. ‘వారికి ఓ టెంపోరరీ పథకం అన్నది ఉన్నట్టు నాకు బోధ పడింది. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఏం చేయాలన్నదానిపై వారు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు’ అని పేర్కొన్నారు.

మార్చి 27 న తనకు స్వల్ప పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని ప్రకటించిన బోరిస్ జాన్సన్.. వారం తరువాత సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఏప్రిల్ 5 న ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం మరుసటి రోజున ఐసియుకి తరలించారు. అక్కడ మూడు రోజులపాటు ఆయనకు ఆక్సిజన్ ఇచ్చారు. ఏప్రిల్ 12 న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనకు చికిత్స చేసిన వైద్య బృందాన్ని జాన్సన్ ప్రత్యేకంగా అభినందిస్తూ.. ఆసుపత్రిలో తనకు కలిగిన అనుభవాలు కరోనాపై గట్టి పోరాటం జరపాలన్న నిర్ణయానికి కారణమయ్యాయన్నారు.