దేశంలో 1302 మంది డాక్టర్లకు కరోనా : ఐఎంఏ

|

Jul 16, 2020 | 2:41 PM

కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం వైరస్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో వైద్యులు యుద్ధం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోనా విధుల్లో వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది.

దేశంలో 1302 మంది డాక్టర్లకు కరోనా : ఐఎంఏ
Follow us on

కరోనా వైరస్‌ ప్రపంచాన్నే వణికిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారిని రక్షించేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా పోరాటంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది సైతం వైరస్ సోకుతుండడం కొంత ఆందోళన కలిగిస్తోంది. తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి కంటికి కన్పించని కరోనా వైరస్‌తో వైద్యులు యుద్ధం చేస్తున్నారు దేశవ్యాప్తంగా కరోనా విధుల్లో వైరస్‌ సోకి ప్రాణాలు కోల్పోతున్న డాక్టర్ల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. ఇప్పటి వరకు దేశంలో 1,302 మంది వైద్యులకు కరోనా వైరస్ సోకినట్లు ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ తెలిపింది. ఇందులో 99 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని ఐఎంఏ వెల్లడించింది. కరోనా చికిత్స సమయంలో ప్రతి వైద్యుడు పూర్తిస్తాయి జాగ్రత్తలు తీసుకుని చికిత్స అందించాలని సూచింది.

అయితే, కరోనా సోకినవారిలో 586 మంది ప్రాక్టీస్‌ చేస్తున్న వైద్యులు కాగా, 566 మంది రెసిడెంట్‌ డాక్టర్లు, 150 మంది హౌస్‌ సర్జన్లు ఉన్నారని నేషనల్‌ కోవిడ్‌ రిజిస్ట్రీ తెలిపింది. చనిపోయిన వైద్యులలో 73 మంది 50ఏండ్లు పైబడిన వారు కాగా, 19 మంది 35-50 ఏళ్ల మధ్య వయస్సుగలవారని ఉన్నారని వెల్లడించింది. ఏడుగురు వైద్యులు మాత్రం 35ఏళ్లలోపువారని వివరించింది. దేశ వ్యాప్తంగా కరోనా విస్తరిస్తున్నవేళ ప్రతి డాక్టర్ తమ ప్రాణాలకు కూడా దృష్టిలో పెట్టుకుని కరోనా బాధితులను రక్షించాలని ఐఎంఏ సూచించింది

RED ALERT FOR #DOCTORS. pic.twitter.com/SuP8T7M3mh

— Indian Medical Association (@IMAIndiaOrg) July 15, 2020