హైదరాబాద్ వర్షాలు.. బాధిత కుటుంబాలకు టాలీవుడ్ సెలబ్రిటీల ఆర్ధిక సాయం.!

వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు.

హైదరాబాద్ వర్షాలు.. బాధిత కుటుంబాలకు టాలీవుడ్ సెలబ్రిటీల ఆర్ధిక సాయం.!

Updated on: Oct 20, 2020 | 3:20 PM

Tollywood Celebrities Ex-Gratia: భాగ్యనగరంపై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరదలకు హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరద నీటితో మునిగిన ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలు చేపడుతోంది. డీఆర్ఎఫ్ బృందాలు వర్షాభావ ప్రాంతాల్లో బోట్లను కూడా అందుబాటులో ఉంచారు.

ఇదిలా ఉంటే వర్షాలతో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు తమవంతు ఆర్ధిక సాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. మెగాస్టార్ చిరంజీవి రూ. 1 కోటి విరాళం ప్రకటించగా.. నాగార్జున రూ. 50 లక్షలు, తారక్ రూ. 50 లక్షలు, మహేష్ బాబు రూ. 1 కోటి విరాళం ప్రకటించారు. అలాగే విజయ్ దేవరకొండ రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించారు. వీరితో పాటు పలువురు డైరెక్టర్లు కూడా ఆర్ధిక సాయాన్ని ప్రకటించారు. కాగా, వరదలతో అతలాకుతలం అవుతున్న తెలంగాణకు ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే.