“ఇద్దరం ఒకేలా ఉంటాం…సెక్స్ రాకెట్‌లో దొరికింది నేను కాదు”

సెక్స్ రాకెట్‌లో దొరికిన నటుడుని నేను కాదు అంటూ వాపోతున్నాడు టాలీవుడ్ యాక్టర్ దావూద్. వాస్తవానికి ఇతడు జబర్దస్త్ దొరబాబును పోలి ఉంటాడు. అందుకే ఆ షో డబుల్ యాక్షన్ థీమ్ సందర్భంగా ఈ నటుడు కూడా దొరబాబుతో కలిసి నటించాడు. అయితే జబర్దస్త్ ఆది టీమ్‌లో స్కిట్‌లు చేసే దొరబాబు, పరదేశి వైజాగ్‌లో సెక్స్ రాకెట్‌లో బుక్కయ్యారు. ఈ ఇద్దరు నటులతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎయిర్‌పోర్ట్ పోలీసులు. అయితే  చాలామంది ఈ విషయంలో […]

ఇద్దరం ఒకేలా ఉంటాం...సెక్స్ రాకెట్‌లో దొరికింది నేను కాదు

Edited By:

Updated on: Mar 05, 2020 | 7:38 PM

సెక్స్ రాకెట్‌లో దొరికిన నటుడుని నేను కాదు అంటూ వాపోతున్నాడు టాలీవుడ్ యాక్టర్ దావూద్. వాస్తవానికి ఇతడు జబర్దస్త్ దొరబాబును పోలి ఉంటాడు. అందుకే ఆ షో డబుల్ యాక్షన్ థీమ్ సందర్భంగా ఈ నటుడు కూడా దొరబాబుతో కలిసి నటించాడు. అయితే జబర్దస్త్ ఆది టీమ్‌లో స్కిట్‌లు చేసే దొరబాబు, పరదేశి వైజాగ్‌లో సెక్స్ రాకెట్‌లో బుక్కయ్యారు. ఈ ఇద్దరు నటులతో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు ఎయిర్‌పోర్ట్ పోలీసులు. అయితే  చాలామంది ఈ విషయంలో దావూద్‌కి ఫోన్ చేసి బండభూతులు తిడుతున్నారట. దాంతో అతడు మీడియా ముందుకు వచ్చి తన గోడును వెళ్లబోసుకున్నాడు.

దావూద్..ఖైదీ నెం 1, డియర్ కామ్రేడ్, అర్జున్ సురవరం, భీష్మ సినిమాల్లో చిన్న, చిన్న పాత్రలు వేశాడు.  దొరబాబుకు సంబంధించిన వీడియోలు చూశానని, కానీ ఆ వీడియోల్లో ఉంది మాత్రం తాను కాదని..దయచేసి తన కుటుంబాన్ని డిస్టబ్ చెయ్యెద్దొని దావూద్ కోరుతున్నాడు. దొరబాబు విషయంలో కూడా తాను బాధపడుతున్నానని, అలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదన్నారు. అలాంటి పనులు తాను చెయ్యనని, దయచేసి అర్థం చేసుకోమని దావూద్ నెటిజన్లను, సన్నిహితులను కోరారు.