‘దిశ’ కుటుంబ సభ్యులను కలిసిన మొదటి హీరో..మనసున్న మనోజ్

|

Dec 03, 2019 | 7:41 PM

మంచు మనోజ్..తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టించి పనిచేసే హీరో. అంతే కాదు సోషల్ ఎవేర్‌నెస్ విషయంలో కూడా ముందుంటాడు ఈ మంచువారబ్బాయి. ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ, ఫ్యాన్స్ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. వారికి ఆర్థికంగా కూడా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశమంతటా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. దీనిపై పలు చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్ రియాక్టయ్యారు. […]

దిశ కుటుంబ సభ్యులను కలిసిన మొదటి హీరో..మనసున్న మనోజ్
Follow us on

మంచు మనోజ్..తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమా కోసం కష్టించి పనిచేసే హీరో. అంతే కాదు సోషల్ ఎవేర్‌నెస్ విషయంలో కూడా ముందుంటాడు ఈ మంచువారబ్బాయి. ఎప్పుడూ సోషల్ మీడియా యాక్టీవ్‌గా ఉంటూ, ఫ్యాన్స్ యోగక్షేమాలు తెలుసుకుంటాడు. వారికి ఆర్థికంగా కూడా సాయం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన ‘దిశ’ హత్యాచార ఘటన దేశమంతటా ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. దీనిపై పలు చిత్ర పరిశ్రమకు చెందిన యాక్టర్స్ రియాక్టయ్యారు. మన టాలీవుడ్ ఇండష్ట్రీలో కొంతమంది నటీనటులు ఘటనను వెంటనే ఖండించారు. బాలీవుడ్ నుంచి సల్మాన్ ట్వీట్ పెట్టాడు,  మనం రియాక్ట్ అవ్వకపోతే ట్రోల్స్ వస్తాయనే భయంతో ఇన్సిడెంట్ జరిగిన రెండు రోజుల తర్వాత రెస్పాండ్ అయిన తెలుగు నటులు కూడా ఉన్నారు లెండి. అంతేకాని ఆ అమ్మాయి ఇంటికివెళ్లి కుటుంబ సభ్యలను పరామర్శించి, ధైర్యం చెప్పిన హీరోలూ ఎవరూ లేరు.

కానీ మనసున్న హీరో మంచు మనోజ్ ముందుకొచ్చాడు. ఈ రోజు దిశ ఇంటికి వెళ్లి, ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా దిశ తల్లి పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కు పోతోందని మనోజ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం.. మహిళల భద్రత కోసం మరింత అవగాహన కల్పించాలని, అటువంటి కార్యక్రమాల్లో తాను కూడా  భాగస్వామినవుతానని పేర్కొన్నాడు. రాక్షసంగా ప్రవర్తించేవారికి బహిరంగంగా శిక్షించాలని,   ఇంకొకసారి తప్పు చేయాలంటేనే భయవేసేలా ఆ శిక్షలు ఉండాలని మనోజ్ అభిప్రాయపడ్డాడు.