Today Petrol Price: శుక్రవారం కాస్త పెరిగిన పెట్రోల్, డీజిల్ ధర్లలో శనివారం పెద్దగా మార్పు కనిపించలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు దేశంలోని కొన్ని నగరాల్లో శనివారం ఇంధన ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.59 ఉండగా, డీజీల్ ధర రూ. 81.17 గా పలికింది. ఇక కరీంనగర్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.87.47 ఉండగా, డీజీల్ ధర రూ.81.05గా ఉంది.
ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర.91.09 ఉండగా, లీటర్ డీజీల్ రూ.83.32గా ఉంది. విశాఖపట్నంలో శనివారం లీటర్ పెట్రోల్ ధర. 89.70 పలకగా, డీజీల్ రూ.82.80 గా నమోదైంది.
ఇక దేశరాజధాని ఢిల్లీ విషయానికొస్తే శుక్రవారంతో పోలిస్తే ఎలాంటి మార్పులు లేవు ఇక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ. 84.20 కాగా డీజీల్ ధర రూ.74.38 గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.83 కాగా, లీటర్ డీజీల్ ధర రూ.81.07 గా ఉంది.
Also Read: Gold KYC: బంగారం కొనుగోళ్లపై ఎలాంటి కేవైసీ అవసరం లేదు.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రిత్వ శాఖ