శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల ఆలయాన్ని ఈ నెల 16న మూసివేయనున్నారు. చంద్రగ్రణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్న టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. జులై 17న తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని శుద్ధిచేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆలయం మూసివేత కారణంగా జులై 16, 17 తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు.