TTD Tickets
వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల విక్రయం ద్వారా టీటీడీకి రూ.6.75 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేసింది.
స్పెషల్ ఎంట్రీ దర్శనం, శ్రీవారి టికెట్లతోపాటు గదుల కోటాను జారీ చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనుంది.
రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శనం కోసం 2.25 లక్షల టికెట్లను ఉదయం 10 గంటల నుంచి టీటీడీ జారీ చేసింది.
రోజుకు 2 వేల టికెట్లు చొప్పున 10 రోజులకుగాను 20 వేల శ్రీవారి దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్‌లైన్‌లో జారీ చేయనుంది.