బెజ్జూర్ లో పెద్దపులి కలకలం

|

Jul 12, 2020 | 5:01 PM

కుమ్రం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. ఈసారి దారినపోయే యువకులపై దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

బెజ్జూర్ లో పెద్దపులి కలకలం
Follow us on

మరోసారి కుమ్రం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టించింది. ఈసారి దారినపోయే యువకులపై దాడి చేసింది. తృటిలో తప్పించుకున్న యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

జిల్లాలోని బెజ్జూరు అటవీ మార్గంలో మరోసారి పెద్దపులి బయటకు వచ్చింది. బెజ్జురు నుంచి కమ్మర్‌గాం వెళ్లే దారిలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకులపైకి పెద్దపులి ఒక్కసారిగా దూసుకువచ్చింది. దీంతో బైక్ పై ఉన్న యువకులు అదుపుతప్పి కింద పడిపోచారు. బైక్ తో పెద్ద శబ్ధం చేయడంతో పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే, ఈ ఘటనలో యువకులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పెద్దపులి సంచారంతో గ్రామస్తులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి పెద్దపులిని బంధించాలని వేడుకుంటున్నారు. ఏ క్షణాన ఏమవుతుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మంచిర్యాల జిల్లాలోనూ పెద్దపులి సంచరిస్తోందని అటవీ అధికారులు చెబుతున్నారు. అటవీ ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత కొద్దిరోజులుగా పెద్ద పులులు జనవాసాల్లో సంచారిస్తుండడంతో ప్రజలకు కంటికి మీద కునుకు లేకుండాపోయింది.