తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు

ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ ఇన్‌చార్జ్ డైరెక్టర్ నాగరత్న అన్నారు.

తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు

Updated on: Jul 12, 2020 | 9:53 AM

ఇవాళ, రేపు తెలంగాణలో మోస్తరు వర్షాలు కురుస్తాయని, నైరుతి రుతుపవనాలు దేశమంతటా విస్తరించాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్రంలో రెండు రోజుల పాటు తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఎండీ ఇన్‌చార్జ్ డైరెక్టర్ నాగరత్న అన్నారు. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ వరకూ ఉత్తర-దక్షిణ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశమున్నందును ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

శనివారం నగరంలోని కొన్ని ప్రాంతాలైన పెద్ద అంబర్‌పేట్, నారాయణగూడ, శివరంపల్లి, కాచిగూడ, ఎల్‌బి స్టేడియం, సాయంత్రం 6 గంటల వరకు 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో నగరంలో గరిష్ట ఉష్ణోగ్రతను 29.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గించింది. ఇది సాధారణం కంటే 1.9 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఐఎండీ గణాంకాల ప్రకారం గత 40 రోజులలో రాష్ట్రవ్యాప్తంగా 40% అధిక వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు.