మరో దారుణం… విషం పెట్టి మూడు ఏనుగులను చంపేశారు.!

కేరళలో గర్భిణి ఏనుగు దారుణ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోక‌ముందే.. ఛతీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మరో అమానుష‌ ఘటన చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లా రాయ్‌పూర్ అడవుల్లోని ప్రతాపూర్ ప్రాంతంలో మూడు ఏనుగుల కళేబరాలు కనిపించాయి.

మరో దారుణం... విషం పెట్టి మూడు ఏనుగులను చంపేశారు.!

Updated on: Jun 11, 2020 | 4:22 PM

కేరళలో గర్భిణి ఏనుగు దారుణ మ‌ర‌ణాన్ని జీర్ణించుకోక‌ముందే.. ఛతీస్‌ఘడ్‌ రాష్ట్రంలో మరో అమానుష‌ ఘటన చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లా రాయ్‌పూర్ అడవుల్లోని ప్రతాపూర్ ప్రాంతంలో మూడు ఏనుగుల కళేబరాలు కనిపించాయి. ఇక వాటిల్లో రెండు ఆడ ఏనుగులు కాగా.. అందులో ఒకటి గర్భిణి అని తెలుస్తోంది.

తొలుత మంగళవారం ఫారెస్ట్ అధికారులకు సూరజ్‌పూర్‌ జిల్లాలో గర్భిణి ఏనుగు కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక దాని పోస్టుమార్టం నివేదికలో ఏనుగు కాలేయంపై తిత్తులు ఉన్నాయని.. అవి ఇన్ఫెక్ట్ అయినట్లు స్పష్టమైందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఇక బుధవారం ప్రతాపూర్ శ్రేణిలో, మొదటి ఏనుగు కళేబరానికి 300 మీటర్ల దూరంలో మరొక ఆడ ఏనుగు కళేబరం అధికారులకు కనిపించింది. అయితే దాని దగ్గర ఏనుగుల గుంపు రోదిస్తూ కనిపించడంతో దాన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. కాగా, రెండో ఏనుగు కళేబరం దొరికిన సమీప ప్రాంతంలోనే మరో మగ ఏనుగు కళేబరం కనిపించింది. మూడు ఏనుగు మరణానికి గల కారణం ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. బొగ్గు గనులు ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో ఇలా ఏనుగులు అనుమానాస్పదం మరణించడం కలకలం రేపుతున్నాయి. కాగా, పోలీసులు వీటికి విషం ఇచ్చి చంపేసి ఉంటారని ప్రాధమిక అంచనాకు వచ్చారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.