కోల్‌కతా : వెస్ట్ బెంగాల్ లోని సిలిగురిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ పార్టీకి చెందిన మూడు కార్యాలయాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. కార్యాలయంలో ఉన్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి.. పార్టీ జెండాలను చింపేశారు. ఇది గమనించిన స్థానిక బీజేపీ నేతలు పోలీసులకు సమాచారం అందించడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌కు పారా మిలటరీ బలగాలను పంపాలని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్‌వర్గీయ ఎన్నికల కమిషన్‌ను కోరారు. ప్రతీ పోలింగ్ కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు అమర్చాలని డిమాండ్ చేశారు.