నెల్లూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆలయాలే టార్గెట్‌గా దోపీడీలకు పాల్పడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. ఒకే రోజు మూడు దేవాలయాల్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఏకంగా అమ్మవారి మెడలోని తాళిబొట్టు అపహరించడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని ఏఎస్ పేట మండలంలో ఉన్న గుంపర్లపాడు గ్రామంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం, వెంకటేశ్వర స్వామివారి ఆలయంతో పాటు విఘ్నేశ్వర ఆలయాల్లో దొంగలు తెగబడ్డారు. మూడు గుళ్లల్లో బంగారం, వెండితో పాటు హుండీలను కూడా లూటీ చేశారు.
వెంకటేశ్వర స్వామి, వినాయకుడి గుడిలోని హుండీలు, రామాలయంలో అమ్మవారి తాళిబొట్టును దుండగులు ఎత్తుకెళ్లారు. స్థానికుల సమాచారంతో గ్రామానికి చేరుకున్న పోలీసులు..దొంగతనం జరిగిన ప్రాంతాలను పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. దొంగలను పట్టుకోడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
Aso Read :
Tirumala Tirupati : శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల జారీ వివాదం..భక్తుల ఆందోళన..స్పందించిన టీటీడీ