దొంగతనం చేయడమే కాదు.. కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. తన ఇంట్లో కూడా దొంగతనం జరిగినట్లు తెగ హడావిడి చేసింది. కి’లేడీ’ వ్యవహానం కాస్త తేడాగా ఉండటంతో పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ జరపడంతో..తానే దొంగతనం చేసినట్లు ఒప్పకుంది. దీంతో చోరీ చేసిన నగలను, నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం జిల్లా బేస్తవారిపేటలో జనపాటి ఆదినారాయణ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. డ్రైప్రూట్స్ వ్యాపారం చేసే అతడు పనుల నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాడు. ఈ నెల 12 న భార్యతో కలిసి కంభం వెళ్లి..పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు.
వారు వచ్చీరాగానే ఎదురు ఇంట్లో నివాసం ఉండే ఓ మహిళ వచ్చి..మా ఇంట్లో..మీ ఇంట్లో దొంగలు పడ్డారంటూ తెగ హడావిడి చేసింది. వెంటనే ఆదినారాయణ ఇంట్లోకి వెళ్లి నగల పెట్టె కోసం వెతకగా అది కనిపించలేదు. దీంతో వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించాడు. అయితే తొలుత విచారణలో ఆదినారయణ ఎదురు ఇంట్లో ఉన్న మహిళ నివాసంలో చోరీ జరగలేదని పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో ఉన్న మహిళ ప్రవర్తనపై అనుమానం కలిగింది. అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా..దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. దీంతో ఆ మహిళను అరెస్ట్ చేసిన పోలీసులు..112 గ్రాముల బంగారం, రూ. 1.95 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన పోలీసులను డీఎస్పీ అభినందించారు.
Also Read :
Drink and Drive : తాగి వాహనం నడిపితే కాలేజీలకు లేఖలు…విద్యార్థులకు సీపీ సజ్జనార్ వార్నింగ్…
Corona vaccine dry run : వ్యాక్సిన్ రిహార్సల్స్.. జనవరి 2న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో డ్రైరన్..