రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారా..?

| Edited By:

Jul 27, 2019 | 1:05 PM

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొట్టినా.. వాటన్నిటినీ కొట్టిపారేశారు రేవంత్. తన ప్రజెంట్,ఫ్యూచర్ అంతా కాంగ్రెస్‌‌తోనే అంటున్నారు. మరోవైపు రేవంత్ పీసీసీ చీఫ్ పదవి చేపట్టనున్నారని కూడా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గనుక ఆ పదవి చేపడితే పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే అవశాలున్నాయని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని […]

రేవంత్ పీసీసీ పగ్గాలు చేపట్టనున్నారా..?
Follow us on

మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే గత కొంతకాలంగా ఆయన పార్టీ మారుతున్నారంటూ ఓ వార్త చక్కర్లు కొట్టినా.. వాటన్నిటినీ కొట్టిపారేశారు రేవంత్. తన ప్రజెంట్,ఫ్యూచర్ అంతా కాంగ్రెస్‌‌తోనే అంటున్నారు. మరోవైపు రేవంత్ పీసీసీ చీఫ్ పదవి చేపట్టనున్నారని కూడా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన గనుక ఆ పదవి చేపడితే పార్టీని సమూలంగా ప్రక్షాళన చేసే అవశాలున్నాయని తెలుస్తోంది. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమిని మూటగట్టుకున్న నేపథ్యంలో పార్టీని బలపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన దృష్టిపెట్టే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం పీసీసీ అధ్యక్షునిగా ఉత్తమ్ కొనసాగుతునే నల్గొండ స్ధానం నుంచి ఎంపీగా గెలుపొందారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు కూడా జరగనున్న నేపథ్యంలో వీటిపై ఉత్తమ్ నేతృత్వంలో పార్టీ దృష్టి సారించింది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ ఇప్పటికిప్పుడు తన పదవిని వదులుకునే అవకాశం లేకపోగా రేవంత్ కూడా ఇప్పుడే ఆ బాధ్యతలను సైతం స్వీకరించరని తెలుస్తోంది. అయితే రేవంత్‌రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేకపోయినా.. ఆ పదవి ఆయనకు ఖచ్చితంగా వస్తుందని మాత్రం పార్టీలో చర్చ జరుగుతోంది. వీటన్నిటీని దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం.