ఇకపై అరుణ్ జైట్లీ స్థానంలో థావర్‌ చంద్ గహ్లోత్

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ స్థానంలో కేంద్రమంత్రి థావర్‌ చంద్ గహ్లోత్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ రాజ్యసభ పక్షనేతగా వ్యవహరించిన అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. థావర్ చంద్‌ గహ్లోత్‌ 2014 నుంచి మోదీ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు. థావర్ చంద్‌ గహ్లోత్‌ 1996 నుంచి 2009 వరకు షాజాపూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం […]

ఇకపై అరుణ్ జైట్లీ స్థానంలో థావర్‌ చంద్ గహ్లోత్

Updated on: Jun 12, 2019 | 1:31 PM

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌జైట్లీ స్థానంలో కేంద్రమంత్రి థావర్‌ చంద్ గహ్లోత్ నియమితులయ్యారు. ఇప్పటివరకూ రాజ్యసభ పక్షనేతగా వ్యవహరించిన అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా.. బీజేపీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. థావర్ చంద్‌ గహ్లోత్‌ 2014 నుంచి మోదీ కేబినెట్‌లో కీలక నేతగా ఉన్నారు. ప్రస్తుతం సామాజిక న్యాయం, సాధికారత శాఖను ఆయన పర్యవేక్షిస్తున్నారు. థావర్ చంద్‌ గహ్లోత్‌ 1996 నుంచి 2009 వరకు షాజాపూర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇక 2012, 2018లో ఎగువసభకు ఎన్నికయ్యారు.