ఈస్టర్ పండగ రోజున లంకలోని కొలంబోలో ఉగ్రవాదులు ఎనిమిది చోట్ల బాంబు పేలుళ్లతో తెగబడి ప్రాణ నష్టం భారీగా జరగడంతో టూరిజం రంగం చతికిలపడుతోంది. ఈ పేలుళ్ల ఘటనలో దాదాపు 295 మంది మృతి చెందగా.. 500 మందిపైగా గాయపడిన సంగతి తెలిసిందే.
2018లో సుమారు 23 లక్షల మంది విదేశీయులు లంకలో పర్యటించారు. గతేడాది నవంబర్ లో ఈ రంగం నుంచి రూ. 36 కోట్ల 27 లక్షలు అర్జించింది శ్రీలంక. కాగా నిన్న జరిగిన పేలుళ్లతో వారి సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని పర్యాటక రంగ అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉంటే లంకలో పర్యటించే విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులే. ఈ ఏడాది భారత్ నుంచి శ్రీలంకను పది లక్షల మంది పర్యాటకులు సందర్శించవచ్చని అంచనా వేశారు. అయితే పేలుళ్లతో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది.