Temple Attacks In AP: ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు..

Temple Attacks In AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఒక పక్కన అమ్మవారి జాతరకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరో తెలుసున్నవారే చేసి ఉండవచ్చునని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. […]

Temple Attacks In AP: ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు..
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 16, 2020 | 2:41 PM

Temple Attacks In AP: ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు కలకలం రేపుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా సూర్యారావుపాలెంలోని అమ్మవారి ఆలయ ముఖద్వారాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో ఒక పక్కన అమ్మవారి జాతరకు ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎవరో తెలుసున్నవారే చేసి ఉండవచ్చునని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: AP Leads Chart In Private Investments

అలాగే శుక్రవారం తెల్లవారు జామున నెల్లూరు జిల్లాలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. బోగోలు మండలం కొండబిట్రగుంటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ రథానికి దుండగులు నిప్పంటించారు. ఒక్కసారిగా పెద్ద మంట రాజుకోవడంతో రథం పూర్తిగా కాలిపోయింది. ఇక ఆ గ్రామానికి చెందిన రెండు వర్గాల ప్రజలు.. దానికి కారణం మీరంటే.. మీరంటూ గొడవకు దిగడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరికి పోలీసులు రంగంలోకి దిగి వారిని శాంతింపజేశారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ రెండు ఘటనలపై స్పందించారు. బాధ్యలు ఎవరైనా కూడా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.