ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ‘ముద్ద మందారం’ సీరియల్‌కు ఎండ్ కార్డు..!

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సీరియల్స్‌లో ‘ముద్ద మందారం’ ఒకటని చెప్పొచ్చు. దేవా, పార్వతీల ప్రేమ.. కుటుంబమమే ప్రాణంగా చేసుకుని బ్రతుకుతున్న అఖిలాండేశ్వరిల మధ్య చుట్టూ తిరిగే కధే ఈ సీరియల్ మూలం. పవన్ సాయి, తనూజ గౌడ, సునందా మలశెట్టి, హరిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన […]

ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ముద్ద మందారం సీరియల్‌కు ఎండ్ కార్డు..!

Updated on: Dec 25, 2019 | 7:42 PM

సీరియల్స్ అంటే మహిళలలే, కాదు ఇప్పుడు పురుషులు కూడా చెవులు కోసుకుంటున్నారు. తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సీరియల్స్‌లో ‘ముద్ద మందారం’ ఒకటని చెప్పొచ్చు. దేవా, పార్వతీల ప్రేమ.. కుటుంబమమే ప్రాణంగా చేసుకుని బ్రతుకుతున్న అఖిలాండేశ్వరిల మధ్య చుట్టూ తిరిగే కధే ఈ సీరియల్ మూలం. పవన్ సాయి, తనూజ గౌడ, సునందా మలశెట్టి, హరిత తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సీరియల్ నవంబర్ 17, 2014ను మొదలు కాగా.. రీసెంట్‌గా ఐదేళ్లు పూర్తి చేసుకుంది. ఇన్నాళ్లు బుల్లితెర వీక్షకులను అలరించండమే కాకుండా టీఆర్పీ రేటింగ్స్‌లో సత్తా చాటుకున్న ‘ముద్ద మందారం’ సీరియల్ ఆఖరి ఎపిసోడ్ ఈ నెల 27న ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.

1585 ఎపిసోడ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ సీరియల్ ఎన్నో మలుపులు తిరుగుతూ ఫ్యాన్స్‌కు ఎంతగానో అలరించింది. ఇక లీడ్ క్యారెక్టర్స్ అభి, సౌందర్యల ఎంగేజ్‌మెంట్‌తో ఎండింగ్‌ను కూడా హ్యాపీ నోట్‌తో ముగింపు పలకాలని యూనిట్ భావిస్తోందని సమాచారం. అంతేకాకుండా పాపులర్ నటీనటుల డాన్స్ పెర్ఫార్మన్స్‌లు కూడా ఫైనల్ ఎపిసోడ్‌కు అదనపు ఆకర్షణ అవుతుందని వినికిడి. అక్షర, శ్రీ ప్రియ, అనూష, ప్రతాప్ అభి, యాంకర్ గీతాంజలిలు స్పెషల్ క్యామియోలు చేయనున్నారని టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. కాగా, రీసెంట్‌గా 1500 ఎపిసోడ్లు కంప్లీట్ చేసుకున్న ఈ సీరియల్ అటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో కూడా తెరకెక్కించారు.