
కొన్నాళ్ల కిందట పోలీసులు చేతిలో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరుల కోసం పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నయీం ముఖ్య అనుచరుడిగా పేరొందిన శేషన్న కోసం తెలుగు రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నారు. నయీం ఎన్‌కౌంటర్ తరువాత శేషన్నకు మాజీ మావోయిస్టు వట్టి వెంకట్ రెడ్డి ఆశ్రయం ఇచ్చినట్లు తెలుస్తోంది. శేషన్నకు కర్నూల్ జిల్లా బొల్లవరంలోని తన బంధువుల ఇంట్లో ఆయన ఆశ్రయ కల్పించినట్లు తెలుస్తోంది. తాజాగా వీరి ఆచూకీపై పోలీసులకు సమాచారం అందగా.. వారిద్దరు అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.