జయప్రకాష్‌ రెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం

ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ

జయప్రకాష్‌ రెడ్డి మరణంపై తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం

Edited By:

Updated on: Sep 08, 2020 | 1:19 PM

Jayaprakash Reddy death: ప్రముఖ సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి మరణం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. పలు సినిమాల్లో విభిన్న పాత్రల్లో నటించి మంచి నటుడిగానే కాకుండా, గొప్ప రంగస్థల నటుడిగా కూడా జయప్రకాష్‌ రెడ్డికి ప్రజల్లో అభిమానం ఉందని కేసీఆర్ అన్నారు.

మరోవైపు జయప్రకాష్ రెడ్డి మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి సంతాపం తెలిపారు. 3 దశాబ్దాల సినీజీవితంలో వైవిధ్యమైన పాత్రలు, తనదైన విలక్షణ నటనతో చిత్రపరిశ్రమలో ఆయన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని అన్నారు. జయప్రకాష్ రెడ్డి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా గుండెపోటు రావడంతో గుంటూరులోని తన ఇంట్లో జయప్రకాష్ రెడ్డి కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ జరగనున్నాయి. కరోనా సోకి జయప్రకాష్ రెడ్డి కుమారుడు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా.. ఆయన సన్నిహితులు, బంధువులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Read More:

ప్రభాస్ ‘ఆదిపురుష్’‌.. ‘సీత’గా ఎవ్వరూ ఊహించని నటి!

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌