#Quarantine days అక్కడ్నించి వచ్చినోళ్ళంతా అన్నవరంలోనే..

| Edited By: Anil kumar poka

Mar 27, 2020 | 1:35 PM

తెలంగాణలో పనిచేసే ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇపుడు అన్నవరంలో ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంగా సొంతిళ్ళకు చేరి.. కుటుంబీకులతో వుందామనుకుని హైదరాబాద్ నుంచి బయలు దేరిన సాఫ్ట్‌వేర్ఱ ఎంప్లాయీస్...

#Quarantine days అక్కడ్నించి వచ్చినోళ్ళంతా అన్నవరంలోనే..
Follow us on

Annavaram shelter for Telangana software employees: తెలంగాణలో పనిచేసే ఆంధ్రా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇపుడు అన్నవరంలో ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ కారణంగా సొంతిళ్ళకు చేరి.. కుటుంబీకులతో వుందామనుకుని హైదరాబాద్ నుంచి బయలు దేరిన సాఫ్ట్‌వేర్ఱ ఎంప్లాయీస్ ఇపుడు ఇటు హైదరాబాద్‌కు కాక… అటు సొంతిళ్ళకు చేరలేక నడి మధ్యలో ఇరుక్కుపోయారు. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు.. ఏకంగా 14 రోజుల క్వారెంటైన్ సెంటర్‌కు వారిపుడు పరిమితమవ్వాల్సిన పరిస్థితి.

లాక్ డౌన్ ప్రకటించడం.. హైదరాబాద్‌లో వున్న వర్కింగ్ హాస్టళ్ళను మూసి వేస్తున్నారన్న వార్తలు గందరగోళ పరచడంతో వందలాది మంది సాఫ్ట్ ‌వేర్ ఉద్యోగులు హైదరాబాద్ వదిలి సొంతూళ్ళకు బయలుదేరారు. అయితే వారిని రానిస్తే.. కరోనా ఎఫెక్టు రెండో దశను దాటి మూడో దశకు చేరుతుందన్న భయంతో వారి రాకను అడ్డుకున్నారు ఏపీ పోలీసులు. అయితే.. ప్రభుత్వాల జోక్యంతో కొంతమంది ఏపీలోకి ఎంటరైపోయారు.

అయితే వీరిని నేరుగా వారి ఇళ్ళకు పంపితే ప్రమాదమని భావించిన ఏపీ అధికారులు… వారిని ప్రత్యేక క్వారెంటైన్ సెంటర్లకు పంపాలని తలపెట్టారు. అందులో భాగంగా హైదరాబాద్ నుంచి విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బయలు దేరిన వారిని తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కాటేజీలకు తరలించారు. వాటిలో క్వారెంటైన్ కోసం ఏర్పాట్లు చేసి అందులో వారిన పద్నాలుగు రోజుల పాటు వుంచాలని నిర్ణయించారు.

కరోనా క్వారంటైన్ సెంటర్‌గా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం కాటేజ్ మారిపోయింది. అందులో తెలంగాణా నుంచి వచ్చిన 93 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులను హరిహర సదన్ కాటేజ్ క్వారంటైన్ సెంటర్‌కు అధికారులు తరలించారు. వీరంతా గురువారం సాయంత్రానికి తెలంగాణ నుంచి వచ్చిన ఏపిలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళేందుకు వచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులుగా గుర్తించారు. బొమ్మూరు క్వారంటైన్ సెంటర్ నిండిపోవడంతో రత్నగిరిపై కాటేజ్‌ను కూడా క్వారంటైన్ సెంటర్ గా ఏర్పాటు చేసిన అధికారులు.. అందులో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.