ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తాం.. త్వరలోనే వరంగల్‌కు రెండు ప్రముఖ కంపెనీలు..

ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నతాధికారులతో..

ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరిస్తాం.. త్వరలోనే వరంగల్‌కు రెండు ప్రముఖ కంపెనీలు..

Updated on: Dec 05, 2020 | 9:58 PM

KTR Review On IT Sector: ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ పరిశ్రమను విస్తరించేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉన్నతాధికారులతో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మహబూబ్‌నగర్‌, వరంగల్‌, కరీంనగర్‌ నగరాలకు ఐటీని విస్తరించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నామన్న మంత్రి.. ఖమ్మంలోనూ ఐటీ టవర్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే రెండు ప్రముఖ కంపెనీలు వరంగల్‌కు రానున్నాయన్నారు.

హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాలకు ఐటీని విస్తరించాలన్న ఉద్దేశంతో.. ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రోత్‌ ఇన్‌ డిస్పర్షన్‌ పాలసీకి మంచి స్పందన లభిస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు‌. ఇప్పటికే పరిశ్రమల శాఖ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో అగ్రస్థానాన్ని సాధించేందుకు కసరత్తు చేస్తుందని ఆ శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ మంత్రి కేటీఆర్‌కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి నాయకత్వం పరిశ్రమలు, పెట్టుబడుల ఆకర్షణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

Also Read:

Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..

కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..

బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. ప‌నికి రానోళ్ల‌ను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్

డార్క్ చాక్లెట్‌తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..