ఆదివాసీల ఆలయానికి కొత్త సొగసులు.. తుది దశకు చేరుకున్న పునర్నిర్మాణ పనులు.. ప్రత్యేకతలు ఏంటంటే..

|

Jan 15, 2021 | 8:33 AM

Nagoba Temple: ఆదిలాబాద్‌లో జరిగే నాగోబా జాతరకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదివాసీల పండుగగా పిలుచుకునే ఈ

ఆదివాసీల ఆలయానికి కొత్త సొగసులు.. తుది దశకు చేరుకున్న పునర్నిర్మాణ పనులు.. ప్రత్యేకతలు ఏంటంటే..
Follow us on

Nagoba Temple: ఆదిలాబాద్‌లో జరిగే నాగోబా జాతరకు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదివాసీల పండుగగా పిలుచుకునే ఈ జాతర ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. ఆదివాసీలకు, ఈ జాతరకు చాలా చరిత్ర ముడిపడి ఉంది. అందుకే ఆదివాసీల జాతరలలో అన్నింటికంటే పెద్ద జాతర నాగోబా జాతరను చెబుతారు. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఆలయ పునర్నిర్మాణ పనులు తుది దశకు వచ్చాయి. మెస్రం వంశీయుల ఆచారాలు, సంస్కృతి కళ్లకుకట్టేలా నాగోబా ఆలయం రూపు దిద్దుకుంటోంది.

రానున్న పుష్యమాసంలో నాగోబా జాతర నిర్వహిస్తారు. నాగదేవత పడగ ఆకారంలో గర్భగుడి ద్వారం, ఆలయ మండపంలో మెస్రం చరిత్రను తెలిపేలా రూపొందిన శిల్పాలు అద్భుతంగా ఉన్నాయి. ఒకప్పటి గోండ్వాన రాజ్యం చిహ్నాలు కూడా కనిపించేలా నిర్మాణం చేస్తున్నారు. 2005లో రూ.10 లక్షలతో నాగోబా ఆలయాన్ని విస్తరించారు. నాగోబా చరి త్రను భావితరాలకందించేలా ఆలయ నిర్మాణం ఉండాలని యోచించిన మెస్రం వంశీయులు 2017 జూన్‌లో రూ.3 కోట్లతో పనులు ప్రారంభించారు. ప్రస్తుతం రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి. పైకప్పు పనులు జరగాల్సి ఉంది. గర్భగుడులకు మెస్రం వంశీయులే విరాళాలు ఇస్తుండగా, మండప నిర్మాణానికి ప్రభుత్వం రూ.50 లక్ష లు అందించనుంది.

తెరుచుకున్న శబరిమల ఆలయం, నేటి నుంచే భక్తులకు అనుమతి, మార్గదర్శకాలివే