‘బతుకమ్మ’ యూకే పోస్టర్ ఆవిష్కరించిన కవిత

| Edited By:

Sep 04, 2019 | 8:53 PM

తెలంగాణ ఉద్యామాన్ని కదిలించి బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణ గుండె చప్పుడుగా వినిపించే బతుకమ్మ పాటలకు పునరుజ్జీవాన్ని పోసింది తెలంగాణ జాగృతి సంస్ధ. ఈ సంస్ధ ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని ప్రపంచ దేశాలకు సైతం తెలిసొచ్చేలా చేశారు సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత. బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా పలు దేశాల్లో కూడా జరిపే విధంగా ఆమె కృషి చేశారు. తాజాగా తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో […]

బతుకమ్మ యూకే పోస్టర్ ఆవిష్కరించిన కవిత
Follow us on

తెలంగాణ ఉద్యామాన్ని కదిలించి బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణ గుండె చప్పుడుగా వినిపించే బతుకమ్మ పాటలకు పునరుజ్జీవాన్ని పోసింది తెలంగాణ జాగృతి సంస్ధ. ఈ సంస్ధ ద్వారా తెలంగాణ అస్థిత్వాన్ని ప్రపంచ దేశాలకు సైతం తెలిసొచ్చేలా చేశారు సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కవిత. బతుకమ్మ పండుగను కేవలం తెలంగాణ జిల్లాల్లోనే కాకుండా పలు దేశాల్లో కూడా జరిపే విధంగా ఆమె కృషి చేశారు.

తాజాగా తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్‌డమ్ శాఖ ఆధ్వర్యంలో యూకేలో నిర్వహించనున్నబతుకమ్మ సంబురాల పోస్టర్‌ను కవిత ఆవిష్కరించారు. బుధవారం ఆమె తన నివాసంలో ఈ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. జాగృతి సంస్ధ ఆధ్వర్యంలో యూకేలోని పది వేర్వేరు ప్రాంతాల్లో ఈ పండుగను నిర్వహించబోతున్నారు. పది పల్లెల బతుకమ్మ, పది కాలాల బతుకమ్మ అనే నినాదంతో యూకేలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు జాగృతి యూకే అధ్యక్షులు సుమన్ బల్మూరి తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి కూడా నారాయణపేట చేనేత చీరలను అందజేస్తామని వారు తెలిపారు.