కొత్త భవనాలకు గ్లోబల్ టెండర్లు..!

| Edited By:

Jun 24, 2019 | 11:10 AM

తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలోనూ నూతన భవనాలను నిర్మించాలని భావిస్తోంది. దీని కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా పొందాయి. ఇక నూతన భవనాల నమూనాలు ఎలా ఉండాలనే దానిపై […]

కొత్త భవనాలకు గ్లోబల్ టెండర్లు..!
Follow us on

తెలంగాణలో కొత్త సచివాలయ నిర్మాణం దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత సచివాలయ స్థానంలోనూ నూతన భవనాలను నిర్మించాలని భావిస్తోంది. దీని కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు కొత్త సచివాలయం, శాసనసభ నిర్మాణాలకు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈనెల 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియను వేగవంతం చేయనున్నారు. దీనికి సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా పొందాయి. ఇక నూతన భవనాల నమూనాలు ఎలా ఉండాలనే దానిపై సీఎం కసరత్తు ప్రారంభించారు.

అయితే కొత్త అసెంబ్లీ భవనం కూడా పాత దాన్ని పోలీ ఉండేలా నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. భవనాలకు సంబంధించిన నమూనాను ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హాఫీజ్ కాంట్రాక్టర్ గతంలో ఇచ్చారు. దీంతో పాటు ప్రస్తుతం చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన మోడల్​ను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దీర్ఘ చతురస్రాకారంలో ఒకే బ్లాక్​గా, పొడవుగా ఉండే చెన్నై కంపెనీ ఇచ్చిన భవన నమూనా కేసీఆర్‌ను బాగా ఆకట్టుకున్నట్లు సమాచారం. ఐతే గతంలో ఇండో అరబిక్ ఆర్కిటెక్చర్​తో హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన నమూనా కూడా ఇంకా ఆయన పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏదో ఒక నమూనాను త్వరలోనే ఖరారు చేయనున్నారని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణాలకు సంబంధించి చర్చించేందుకు ఈరోజు నుంచి మూడు రోజుల పాటు అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నారు. భవనాల నమూనాలతో పాటు, టెండర్ల బడ్జెట్ కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.