తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..

|

Jul 11, 2020 | 12:14 PM

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. మొదట్లో […]

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ఇంటికే ఉచితంగా కిట్లు పంపిణీ..
Follow us on

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కరోనా పేషంట్లకు ఉచితంగా కిట్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతుండటం.. అలాగే హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోన్న నేపధ్యంలో సర్కార్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 10 వేల మందికి పైగా కరోనా పేషంట్లు హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు. మొదట్లో వీరిలో ఎలాంటి లక్షణాలు బయటపడకపోయినా.. రెండు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు స్వల్పంగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే వారికి ఉచితంగా కరోనా కిట్లను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. 17 రోజులకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, హైడ్రాక్సీక్లోరోక్విన్, పారాసెటమాల్, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లు, ఎసిడిటీ తగ్గించే టాబ్లెట్లతో పాటు ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలపై అవగాహన కల్పించే ఓ పుస్తకం లాంటివి ఉంటాయి.

Also Read:

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రతీ జిల్లాలో కోవిడ్ కేర్ సెంటర్..!

తెలంగాణ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఇంటర్ సిలబస్‌లో 30% కోత.!

భక్తులకు ముఖ్య గమనిక.. వాటి జోలికి వెళ్లొద్దంటూ టీటీడీ హెచ్చరిక..

ఏపీ ప్రజలకు గమనిక.. ఆరోగ్యశ్రీ పరిధిలో కరోనా చికిత్స అందించే ఆసుపత్రులు ఇవే..