కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 675 కోట్లు విడుదల..

కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆడ పిల్లల వివాహాల నిమిత్తం కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.675 కోట్లు విడుదల చేసింది.

కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 675 కోట్లు విడుదల..

Edited By:

Updated on: Jul 04, 2020 | 6:07 AM

కరోనా సంక్షోభ సమయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆడ పిల్లల వివాహాల నిమిత్తం కళ్యాణ లక్ష్మి పథకం కింద రూ.675 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం బడ్జెట్‌లో ఈ పథకానికి రూ.1350 కోట్లు కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం లోని దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన నిరుపేద యువతుల వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.