జీహెచ్ఎంసీ ఎన్నికల పర్వం రసవత్తరంగా సాగింది. ఇక మేయర్ పదవి ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ మొదలైంది.. రిజర్వేషన్ల రోటేషన్ ప్రకారం ఈసారి మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. ఇన్నేళ్లలో.. కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే.. భాగ్యనగరం మేయర్ పీఠంపై కూర్చున్నారు. మూడోసారి మహిళా అభ్యర్థికి మేయర్ పీఠాన్ని అధిరోహించే అవకాశం వచ్చింది. 2020 గ్రేటర్ ఎన్నికల్లో.. మేయర్ పదవిని జనరల్ మహిళకు రిజర్వ్ చేయడంతో..పొలిటికల్ సీన్ మారిపోయింది. నగర ప్రథమ పౌరురాలిగా జనరల్ మహిళకు రిజర్వు కావడంతో గట్టి పోటీ నెలకొంది. టీఆర్ఎస్‌లోనే సుమారు డజను మంది ఔత్సాహికులు పదవిని ఆశిస్తున్న వారిలో వారసులే ఎక్కువగా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు సునరితారెడ్డి (మూసారాంబాగ్)మేయర్ పీఠం కోసం పోటీపడుతున్నారు. ఇప్పటికే విస్తృత ప్రచారం నిర్వహించిన ఆమె మేయర్ సీటు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మేయర్‌గా నగర అభివృద్దికి కృషిచేస్తానని స్పష్టం చేశారు.