T20 World Cup 2024:ప్లేస్ ఉన్నా వీరు ఆడేది కష్టమే.. ప్రపంచ కప్ లో టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్- XI ఇదే

హ్మదాబాద్‌లో బీసీసీఐ సెక్రటరీ జే షా, సెలక్షన్ కమిటీ మధ్య జరిగిన సమావేశం అనంతరం 15 మంది భారత జట్టు సభ్యులను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడికి తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం లభించనుంది. రిషబ్ పంత్, సంజూ శాంసన్, యుజేంద్ర చాహల్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ టీమ్ లో స్థానం కల్పించారు.

T20 World Cup 2024:ప్లేస్ ఉన్నా వీరు ఆడేది కష్టమే.. ప్రపంచ కప్ లో టీమిండియా అత్యుత్తమ ప్లేయింగ్- XI ఇదే
Team India
Follow us

|

Updated on: Apr 30, 2024 | 8:54 PM

ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ 2024 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. అహ్మదాబాద్‌లో బీసీసీఐ సెక్రటరీ జే షా, సెలక్షన్ కమిటీ మధ్య జరిగిన సమావేశం అనంతరం 15 మంది భారత జట్టు సభ్యులను ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో యశస్వి జైస్వాల్ లాంటి ఆటగాడికి తొలిసారి టీ20 ప్రపంచకప్ ఆడే అవకాశం లభించనుంది. రిషబ్ పంత్, సంజూ శాంసన్, యుజేంద్ర చాహల్, శివమ్ దూబే వంటి ఆటగాళ్లు ప్రపంచ కప్ టీమ్ లో స్థానం కల్పించారు. అయితే మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కేఎల్ రాహుల్ కు స్థానం దక్కలేదు. అలాగే శుభమాన్ గిల్ రింకూ సింగ్‌ ట్రావెలింగ్ రిజర్వ్ లిస్ట్ లో మాత్రమే చోటు దక్కింది. సరే, ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే, టీమ్ ఇండియాలో అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్ ఏదన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. టీ20 ప్రపంచకప్ 2024లో కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. గతంలో ఈ ఇద్దరు ఆటగాళ్లు చాలా మ్యాచ్‌లు గెలిపించారు. కాబట్టి ప్రపంచ కప్‌లో కూడా ఈ జోడినే ఓపెనర్లుగా కొనసాగించవచ్చు.

ఇక రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 3వ నంబర్‌లో బ్యాటింగ్ దిగుతాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌లో కనిపిస్తాడు. అయితే మ్యాచ్ పరిస్థితులను బట్టి మార్పులు జరిగే అవకాశం ఉంది. రిషబ్ పంత్ 5వ స్థానంలో ఆడగలడు కాబట్టి వికెట్ కీపర్‌గా అతనే ఫస్ట్ ఛాయిస్ అవుతాడు. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉండటం ఖాయం. అక్షర్ పటేల్ ఎంట్రీతో జట్టు బ్యాటింగ్ బలం కూడా పెరుగుతుంది. బౌలర్లలో కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ లేదా సిరాజ్ ప్లేయింగ్ ఎలెవన్‌లో కనిపిస్తారు.

టీమ్ ఇండియా అత్యుత్తమ ప్లేయింగ్ ఎలెవన్

ఇవి కూడా చదవండి

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్/మహమ్మద్ సిరాజ్.

ఈ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు కష్టమే..

సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్, టీ20 ప్రపంచకప్‌లో అవకాశం దొరకడం కష్టం. తోటి ఆటగాడికి గాయం అయినప్పుడు మాత్రమే ఈ ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవెన్‌లో చూడవచ్చు. మరి శివమ్ దూబేని టీమ్ ఇండియా ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles