వచ్చే వారం ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియా జట్టు ఎంపిక..

టీమిండియా టూర్ ఫిక్స్ అయ్యింది. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఐపీఎల్-13 సీజన్‌ ముగిసిన  వెంటనే విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు యూఏఈ నుంచే నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్‌ 27న మూడు టీ20ల సిరీస్‌ ఆరంభంకానుండగా.. డిసెంబర్‌ 4న మూడు వన్డేల సిరీస్‌ మొదలవనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. డే/నైట్‌ […]

వచ్చే వారం ఆస్ట్రేలియా టూర్ కోసం టీమిండియా జట్టు ఎంపిక..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Oct 07, 2020 | 7:12 AM

టీమిండియా టూర్ ఫిక్స్ అయ్యింది. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య సిరీస్‌ నిర్వహణ కోసం ఇప్పటికే బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఒక ఒప్పందానికి వచ్చాయి. ఐపీఎల్-13 సీజన్‌ ముగిసిన  వెంటనే విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు యూఏఈ నుంచే నేరుగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. నవంబర్‌ 27న మూడు టీ20ల సిరీస్‌ ఆరంభంకానుండగా.. డిసెంబర్‌ 4న మూడు వన్డేల సిరీస్‌ మొదలవనుంది. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ డిసెంబర్‌ 17 నుంచి ప్రారంభంకానున్నట్లు సమాచారం. డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌తోనే టెస్టు సిరీస్‌ మొదలుకానున్నట్లు తెలిసింది.

నవంబర్‌ 27న మూడు టీ20ల సిరీస్‌ 

డిసెంబర్‌ 4న మూడు వన్డేల సిరీస్

డిసెంబర్‌ 17 నుంచి నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్

అయితే.. టీమిండియా కోచింగ్‌సిబ్బంది, సపోర్ట్‌ స్టాఫ్‌, టెస్టు స్పెషలిస్ట్‌ బ్యాట్స్‌మెన్లు పుజారా, హనుమ విహారి తదితరులు అక్టోబర్‌ ఆఖరి వారంలో యూఏఈకి వెళ్లనున్నారు. నవంబర్‌ 4న ఫస్ట్‌ బ్యాచ్‌ దుబాయ్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్లనుండగా.. ఐపీఎల్‌ ప్లేఆఫ్‌కు అర్హత సాధించిన జట్లలోని భారత ఆటగాళ్లు నవంబర్‌ 11ను ఆసీస్‌కు బయలుదేరుతుంది. షెడ్యూల్‌ ఖరారైన నేపథ్యంలో సునీల్‌ జోషీ నేతృత్వంలోని జాతీయ సెలక్షన్‌ ప్యానెల్‌ ఆసీస్‌తో జరిగే సిరీస్‌ కోసం వచ్చే వారం భారత క్రికెట్‌ జట్టును ఎంపిక చేయాలని బీసీసీఐ కోరనుంది.