ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంగించినప్పుడు.. ఉద్యోగ సంఘాలకు కరోనా గుర్తుకు రాలేదా? : టీడీపీ నేత పట్టాభి ప్రశ్న

|

Jan 23, 2021 | 7:10 PM

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో ఉద్యోగ సంఘాల వైఖరిని టీడీపీ సీనియర్ నేత పట్టాభి తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ..

ప్రభుత్వ కార్యక్రమాల్లో నిబంధనలు ఉల్లంగించినప్పుడు.. ఉద్యోగ సంఘాలకు కరోనా గుర్తుకు రాలేదా? : టీడీపీ నేత పట్టాభి ప్రశ్న
Follow us on

ఏపీ పంచాయతీ ఎన్నికల నిర్వహణ అంశంలో ఉద్యోగ సంఘాల వైఖరిని టీడీపీ సీనియర్ నేత పట్టాభి తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ సంక్షోభానికి సీఎం జగన్ ప్రభుత్వం తెరలేపుతోందన్న ఆయన, మీ వాదనలు విన్న తర్వాతే కదా.. హైకోర్టు తీర్పు నిచ్చిందని నిలదీశారు. అమ్మఒడి సహా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో కరోనా నిబంధనలు ఉల్లంగించినప్పుడు.. ఉద్యోగ సంఘాలకు కరోనా గుర్తుకు రాలేదా.? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడే ఉద్యోగుల ప్రాణాలు ప్రభుత్వానికి గుర్తొచ్చాయా? అని పట్టాభి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సందర్భంలో ఉద్యోగ సంఘాల నాయకుడి వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని మండిపడ్డారు. చంపే హక్కు రాజ్యాంగం ఇచ్చిందంటూ వెంకట్రామిరెడ్డి అంటున్నారని ఇది అందరూ ఖండించాల్సిన విషయమని పట్టాభి పేర్కొన్నారు. ఇలాఉండగా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు ఎదురుచూస్తామని, అంతవరకు ఎన్నికలకు సహకరించేది లేదని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి స్పష్టం చేసిన నేపథ్యంలో పట్టాభిరామ్ పై విధంగా స్పందించారు.