Breaking News: గుంటూరుజిల్లాలో ఒక్కసారిగా రాజకీయ కలకలం చెలరేగింది. పల్నాడు లో తెలుగుదేశం పార్టీ నేత హత్యకు గురయ్యారు. దాచేపల్లి మండలం పెదగార్లపాడు మాజీ సర్పంచ్ పురంశెట్టి అంకులును కొంతుకోసి హత్యచేశారు దుండగులు. దీంతో స్థానిక టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఘటనా స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు.