‘అమ్మఒడి’ అద్భుత ఒరవడి : కేశినేని నాని

‘అమ్మఒడి’ పథకం మంచి కార్యక్రమమని… విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థులను ఈ పథకం అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు… కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరఫున ఆయన అవార్డులు అందించారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు… దాతలు ముందుకు రావాలని కేశినేని పిలుపునిచ్చారు. ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని […]

అమ్మఒడి అద్భుత ఒరవడి : కేశినేని నాని
Kesineni Nani

Updated on: Sep 07, 2019 | 1:58 PM

‘అమ్మఒడి’ పథకం మంచి కార్యక్రమమని… విధివిధానాలు సక్రమంగా ఉంటే వంద శాతం ఫలితాలు వచ్చే అవకాశం ఉందని టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని నాని అభిప్రాయపడ్డారు. పేద విద్యార్థులను ఈ పథకం అక్ష్యరాస్యులుగా తీర్చిదిద్దుతుందని అన్నారు. విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయులకు… కస్తూరి పూర్ణచంద్ర ఫౌండేషన్ తరఫున ఆయన అవార్డులు అందించారు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకునేందుకు… దాతలు ముందుకు రావాలని కేశినేని పిలుపునిచ్చారు.

ప్రతి పేద తల్లి పిల్లల్ని ఏ బడికి పంపినా అమ్మ ఒడి పథకాన్ని వర్తింప చేస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం గతంలో స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో వైసీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు అమ్మఒడి పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికి రిపబ్లిక్ దినోత్సవం జోరున 15 వేల రూపాయల సాయం అందించనున్నారు.  ‘అమ్మ ఒడి’ పథకాన్ని పాఠశాలల విద్యార్థులతోపాటు ఇంటర్‌ చదివేవారికి కూడా వర్తింపచేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఇదిలా ఉండగా.. అమ్మఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం చేయాలని పలువురు విద్యావేత్తలు, మేథావులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా ప్రైవేటు స్కూళ్లకూ దీన్ని వర్తింపజేస్తే భవిష్యత్తులో ఏ తల్లీ తండ్రీ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించే అవకాశం ఉండదని వారు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే డబ్బులు తీసుకుంటూ పిల్లలను ప్రైవేటు ఫాఠశాలల్లో చదివించుకుంటారని, దీని వల్ల ఇప్పటికే తగ్గిపోతున్న ప్రభుత్వ పాఠశాలలు పూర్తిగా మూతపడే ప్రమాదముందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు కూడా ఈ పథకం వర్తింపజేస్తామని ప్రభుత్వం ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.