బ్రేకింగ్: గుంటూరు జిల్లాలో టెన్షన్.. టెన్షన్..

| Edited By:

Sep 11, 2019 | 7:42 AM

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇరు పార్టీల నిరసనలకు అనుమతిని నిరాకరించిన పోలీసులు హౌస్ అరెస్టులు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబును బయటకురాకుండా హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు లోపలికి రాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పరిణామాలు […]

బ్రేకింగ్: గుంటూరు జిల్లాలో టెన్షన్.. టెన్షన్..
Follow us on

గుంటూరు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చిన టీడీపీ, వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఇరు పార్టీల నిరసనలకు అనుమతిని నిరాకరించిన పోలీసులు హౌస్ అరెస్టులు చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబును ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబును బయటకురాకుండా హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు లోపలికి రాకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. పోలీసులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.