
న్యాయస్థానాల తీర్పులను కూడా గౌరవించకపోతే ఏంచేసేదంటూ నిట్టూర్చారు టీడీపీ నేత దేవినేని ఉమ. జగన్ సర్కారు కోర్టుల ఆదేశాల్ని కూడా బేఖాతరు చేస్తోందని విమర్శించారు. విశాఖలో సువిశాలమైన ప్రాంతంలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణపు పనులు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చారు. కొండపై యంత్రాలు, మనుషుల హడావుడి ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండపై జరుగుతున్న ఆ నిర్మాణం గెస్ట్ హౌస్ కోసమా? లేక సచివాలయ భవనం కోసమా? చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలను అడ్డుకోవాల్సిన వీఎంఆర్డీయే ద్వారానే నిర్మాణ ప్రక్రియ జరుగుతోందని వాపోయారు. ఇటీవలే బిడ్ల ప్రకటన కూడా చేశారని.. ఇదంతా చూస్తుంటే అర్థంకాని పరిస్థితి ఉందని ఉమ వైసీపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు.