AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది.

ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్
Balaraju Goud
|

Updated on: Aug 31, 2020 | 4:57 PM

Share

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అనారోగ్యం నుంచి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రి నుంచి అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ అయ్యారు. రెండ్రోజుల క్రితమే ఈఎస్ఐ కేసులో అచ్చెన్నకు బెయిల్ మంజూరు అయ్యింది. కరోనా పాజిటివ్ రావడంతో మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో అచ్చెన్న చికిత్సపొందుతున్నారు. పూర్తి ఆరోగ్యంతో ఆస్పత్రి నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా అచ్చెన్నకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. ఆస్పత్రి నుంచి నేరుగా అచ్చెన్నాయుడు ఇంటికి చేరుకున్నారు.

ఈఎస్‌ఐ అక్రమాల కేసులో అరెస్టయిన అచ్చెన్నాయుడు అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరారు. జ్యుడీషియల్‌ కస్టడీ సమయంలోనూ అచ్చెన్నాయుడికి రెండు మార్లు శస్త్రచికిత్స జరగడంతోపాటు కోవిడ్‌ బారినపడ్డారు. దీంతో ఆయన ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చేరారు. కాగా, అచ్చెన్నాయుడ ఆరోగ్యపరిస్థితులను నేపథ్యంలో ఈఎస్‌ఐ కేసులోఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. విజయవాడ ఏసీబీ కోర్టులో పూచీకత్తు సమర్పించి బెయిల్‌ పొందాలని ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయరాదని అదేశించింది. అలాగే కేసు దర్యాప్తునకు అందుబాటులో ఉండాలని కోర్టు షరతులు విధించింది.

Follow Us
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్స్ ఇవే..
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
తెల్లారితే నిశ్చితార్థం..షాప్‌కు వెళ్తానని చెప్పి వెళ్లిన యువకుడు
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
ఒమేగా-3 VS ఫిష్ ఆయిల్..గుండె, మెదడుకు ఏది బెస్ట్? డైటీషియన్ల సూచన
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
విజయ్‌‌‌కు రూ.600 కోట్ల ఆస్తులు.. లగ్జరీ కార్ల మధ్య TVS మోపెడ్‌
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
హనుమాన్ జయంతికి ఈ స్వీట్ బూందీ ప్రసాదంగా చేస్తే.. జనాలు ఫిదా
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!
లోన్‌ తీసుకున్న వారికి గుడ్‌న్యూస్‌!