టీడీపీ నేతలు కేశినేని నాని, బుద్ధావెంకన్నలకు హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చినట్టు సమాచారం. ఇటీవల కొద్దిరోజులుగా వెంకన్న, నానిల మధ్య ట్వీట్ల వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదంలోకి చంద్రబాబును కూడా లాగారు కేశినేని నాని. ‘చంద్రబాబు గారూ.. మీ పెంపుడు కుక్కను నియంత్రిస్తారా.. లేదా.. నన్ను పార్టీకి రాజీనామా చేయమంటారా..? అంటూ మాజీ సీఎం చంద్రబాబుకు నాని ఘాటైన ట్వీట్ చేశారు. ఇందుకు స్పందించిన హైకమాండ్ పరిస్థితిని చక్కబెట్టే కార్యక్రమం చేపట్టింది. ఇరువురి నేతలూ సంయమనం పాటించాల్సిందిగా హైకమాండ్ సూచించింది. కాగా.. ఇరువురి నేతలతో త్వరలోనే చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది.