అప్పుడే టీడీపీ నేతలపై తప్పుడు కేసులా..? : బాబు

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోయేముందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరు నెలల పాటు మౌనంగా ఉందామని అనుకున్నామని కానీ.. టీడీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీకి సమయం ఇవ్వడం వృథా అని చెప్పారు. ఇప్పటికే టీడీపీపై బురద చల్లే కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మా పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునే […]

అప్పుడే టీడీపీ నేతలపై తప్పుడు కేసులా..? : బాబు

Edited By:

Updated on: Jun 12, 2019 | 5:06 PM

అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనబోయేముందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వానికి సహకరిస్తూ ఆరు నెలల పాటు మౌనంగా ఉందామని అనుకున్నామని కానీ.. టీడీపీ కార్యకర్తలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వైసీపీకి సమయం ఇవ్వడం వృథా అని చెప్పారు. ఇప్పటికే టీడీపీపై బురద చల్లే కార్యక్రమాలు, తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు మొదలయ్యాయని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని మా పార్టీ నేతలపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని పేర్కొన్నారు చంద్రబాబు.

Loading...
Unable to load recommendations.
Follow Us