వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో కౌన్సిల్ సాక్షిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి మధ్య విభేదాలు తలెత్తాయి. సమావేశంలో స్వాగత బోర్డును ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వ్యతిరేకించారు. కమిషనర్‌కు సమాచారం లేకుండా ఎజెండా ఎలా ఏర్పాటు చేశారని ప్రశ్నించారు. అధికార కౌన్సిలర్లు రెండుగా విడిపోయారు. ప్రతిపక్ష పార్టీ కౌన్సిలర్లు ఎజెండాను చించేశారు. సమావేశంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. దీంతో సమావేశం గందరగోళంగా మారింది. అయితే సభను ప్రశాంతంగా నడిపించేందుకు ఎంత ప్రయత్నించినా విమర్శలతో కొనసాగింది.