
దేశంలో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. నిత్యం కొత్తకేసులు నమోదవుతూనే ఉన్నాయి. కాగా, కోలుకుంటున్నవారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో కాస్త ఉపశమనం కలిగిస్తోంది. తాజాగా తమిళనాడులో కరోనా యాక్టివ్ కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసులు, రికవరీలు ఇంచుమించు సమానంగా ఉంటుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్యలో పెద్దగా మార్పు ఉండటంలేదు. గడిచిన 24 గంటల వ్యవధిలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం సాయంత్రం వరకు కొత్తగా 5,242 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని తమిళనాడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ లో పేర్కొంది. కాగా, ఒక్కరోజులోనే 5,222 మంది కొవిడ్ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,51,370కి చేరింది. అందులో ఇప్పటివరకు 5,97,033 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తమిళనాట మరో 44,150 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక, శనివారం కొత్తగా 67 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో తమిళనాడులో మొత్తం కరోనాను జయించలేక 10,187 మంది మరణించినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Tamil Nadu reports 5,242 new #COVID19 cases, 5,222 recoveries & 67 deaths today, taking total positive cases to 6,51,370, including 5,97,033 discharged cases, 10,187 deaths & 44,150 active cases: State Health Department pic.twitter.com/8rsccUU4Xr
— ANI (@ANI) October 10, 2020