తమిళనాడును వీడని కరోనా రక్కసి

|

Sep 12, 2020 | 8:45 PM

నిత్యం వస్తున్న కరోనా హెల్త్ బులిటెన్‌తో తమిళనాడువాసులు వణికిపోతున్నారు. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు ఆరు వేలకు తగ్గడం లేదు.  రోజు రోజుకు క‌రోనా రక్కసి మ‌రింత విజృంభిస్తున్న‌ది.

తమిళనాడును వీడని కరోనా రక్కసి
Follow us on

Tamil Nadu Corona : నిత్యం వస్తున్న కరోనా హెల్త్ బులిటెన్‌తో తమిళనాడువాసులు వణికిపోతున్నారు. ప్రతి రోజు కరోనా పాజిటివ్ కేసులు ఆరు వేలకు తగ్గడం లేదు.  రోజు రోజుకు క‌రోనా రక్కసి మ‌రింత విజృంభిస్తున్న‌ది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి శ‌నివారం సాయంత్రం వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 6,227 మంది క‌రోనా పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం కేసుల సంఖ్య 4,97,066కు చేరింది. మొత్తం కేసుల‌లో 4,41,649 మంది ఇప్ప‌టికే వైర‌స్ బారి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. మ‌రో 47,110 యాక్టివ్ కేసులు తమిళనాడులో ఉన్నాయని తాజా బులిటెన్‌లో వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

కాగా, క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో క్ర‌మం త‌ప్ప‌కుండా న‌మోద‌వుతున్నాయి. గ‌త 24 గంట‌ల్లో కూడా కొత్త‌గా 76 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 8,307కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్య‌శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.