వలసకూలీలకు స్వరాష్ట్రంలో చేదు అనుభవం

తమిళనాడు వలస కూలీలకు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది కలకత్తా నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వచ్చిన వలస కూలీలకు తమిళనాడులోకి వెళ్లేందుకు వీలులేక సరిహద్దులోని కుప్పంలో పడిగాపులుగాస్తున్నారు.

వలసకూలీలకు స్వరాష్ట్రంలో చేదు అనుభవం

Updated on: Jun 28, 2020 | 8:39 PM

తమిళనాడు వలస కూలీలకు సొంత రాష్ట్రంలో చేదు అనుభవం ఎదురైంది. కరోనా ధాటికి ఉపాధి కోల్పోయి పూట గడవడమే కష్టంగా మారిన వలసకార్మికులు సొంతూర్ల చేరుకుంటుంటే, సొంత రాష్ట్రం పోలీసులే తరిమి కొట్టారు. కలకత్తా నుంచి సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వచ్చిన వలస కూలీలకు తమిళనాడులోకి వెళ్లేందుకు వీలులేక సరిహద్దులోని కుప్పంలో పడిగాపులుగాస్తున్నారు.

బ్రతికుదెరువు వెతుక్కుంటూ పశ్చిమ బెంగాల్ కు వెళ్లారు వేలాది మంది కార్మికులు. కరోనా మహమ్మారి ధాటికి ఉన్న ఉపాధి కోల్పోయారు. దీంతో కుటుంబభారం కష్టంగా మారి రోడ్డునపడ్డారు. కలకత్తాలోని వలసకార్మికులందరూ తమ సొంతూర్ల వెళ్లాలని ఆ రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం వారికి ప్రత్యేక రైలును కూడా ఏర్పాటు చేసింది. దీంతో కలకత్తా నుంచి తమిళనాడుకు శ్రామిక్ రైలులో 300 మంది వలస కూలీలు చేరుకున్నారు. అయితే జోలార్ పేట రైల్వే స్టేషన్ లో దిగేందుకు రైల్వే పోలీసులు అనుమతించలేదు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వస్తున్న వారిని అడ్డుకుని తరిమికొట్టారు జి ఆర్ పి పోలీసులు. దీంతో చేసేదీలేక వలసకూలీలు తిరుగుటప్పా కట్టి జోలార్ పెట్ నుంచి అదే ట్రైన్ లో చిత్తూరు జిల్లా కుప్పం చేరుకున్నారు. కరోనా కేసులతో కుప్పం రెడ్ జోన్ పరిధిలో ఉండటంతో అక్కడ కూడా వారికి ఛేదు అనుభవం ఎదురైంది. కుప్పం లో ఉండేందుకు వీలు లేదంటున్న స్థానిక పోలీసులు హుకుం జారీ చేశారు. దీంతో వారందర్నీ ఏపీ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు చిత్తూరు జిల్లా జిల్లా పోలీసులు. ఎంతో వ్యయ ప్రయాసలకు ఒడ్చి ఇంతదూరం వస్తే తరిమేస్తున్నారని వలసకూలీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాగైనా తమను సొంత రాష్ట్రానికి చేర్చాలని వేడుకుంటున్నారు.