Tamilnadu CM Stalin: తమిళనాడు ముఖ్యమంత్రిగా పదివి చేపట్టినప్పటినుంచి పాలనలో తనదైన మార్కు చూపిస్తున్నారు. ప్రజల కష్టాలను, వారికీ కావాల్సిన అవసరాలను ప్రజల మధ్యకు వెళ్లిమరీ తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి స్టాలిన్ తాజాగా ధర్మపురి జిల్లా పోలీసులకు షాక్ ఇచ్చారు. సేలం జిల్లా నుండి ధర్మపురి కి వెళ్తున్న మార్గం లో ఉన్న ఆథియమాంపేట పోలీస్ స్టేషన్ లో సీఎం స్టాలిన్ అకస్మాత్తుగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన సీఎం స్టాలిన్.. పోలీస్ స్టేషన్ లో వస్తున్న ఫిర్యాదులు, వాటిపై పోలిసుల చర్యలు అన్నింటిపై అరా తీశారు. రాత్రి సమయం లో పోలీస్ స్టేషన్ లో ఉన్న సిబ్బంది తో వారి సమస్యలపై ఆరాతీశారు. సీఎం స్టాలిన్ ఆర్థ్రరాత్రి పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది .
స్టాలిన్ ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన అనంతరం తనదైన శైలిలో పాలన చేస్తూ ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. కరోనా సమయంలో స్టాలిన్ ప్రజలకు అండగా నిలిచిన తీరు ఆకట్టుకుంది. ప్రభుత్వ కమిటీల్లో ప్రతిపక్ష నేతలకు స్థానం కల్పించిన సీఎం కు మంచి పేరు తెచ్చాయి. కక్ష పూరిత రాజకీయాలకి బ్రేక్ వేస్తూ.. పేదల ఆకలి తీర్చే ప్రభుత్వ క్యాంటిన్లను అదే పేరుతో కొనసాగిస్తున్న స్టాలిన్ నేచర్ కు ప్రతిపక్షాల నేతలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వీడియో చూసి.. స్వయంగా ఆస్పత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించి.. వైద్యానికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి తనిఖీలు చేయడమే కాదు.. పోలీసుల సమస్యల గురించి అడగంపై కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Gum Arabic Tree: అనేక వ్యాధులకు చెక్ పెట్టే ‘నల్ల తుమ్మ’ గ్రీకు ఆయుర్వేద వైద్యంలో ఇప్పటికీ ఉపయోగిస్తున్న వైనం..