రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడత కార్యక్రమం మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఆయన పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. ఇటీవలే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆయన తారక్, విజయ్, శృతి హాసన్‌ని నామినేట్ చేసిన సంగతి తెలిసిందే.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు తమిళ స్టార్ ఇళయథలపతి విజయ్. ఈ రోజు విజయం చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇందులో అందరూ పాల్గొనాలి. ఇతర దేశాలతో పోల్చితే మనదేశంలో ఒక్క మనిషికి కావాల్సిన మొక్కలు చాలా తక్కువ. వాటి ద్వారా వచ్చే ఆక్సిజన్ సరిపోవడం లేదు. అందువల్ల దేశ రాజధానిలో ఆక్సిజన్ అమ్మే కేంద్రాలు నెలకొల్పారు. కాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు విజయ్.
#GreenIndiaChallenge with love from @actorvijay ♥️ to @urstrulyMahesh this is jus WOW !! ????????
Lots of respect ✊ for this love ?? https://t.co/GsOQBkmQsm— thaman S (@MusicThaman) August 11, 2020
Read More:
బ్రేకింగ్ః మాజీ మంత్రి ఖలీల్ బాషా కన్నుమూత
రేణు దేశాయ్ సంచలన నిర్ణయం.. లగ్జరీ కార్లు అమ్మేసి!
మరింత క్షీణించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
క్షీణించిన ఎంపీ నవనీత్ కౌర్ ఆరోగ్యం! మరో ఆస్పత్రికి తరలింపు