మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల మాన‌వ‌త్వానికి ఎయిర్ ఇండియా స‌లాం

|

Aug 11, 2020 | 1:52 PM

ఇంట్లో కుటుంబ సభ్యులు చ‌నిపోతున్నా కూడా క‌నీసం ప‌ట్టించుకోని సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా ప్రాణాలు కాపాడానికి ఎగ‌బ‌డి వెళ్లారు మ‌ల‌ప్పురం ప్ర‌జ‌లు.

మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల మాన‌వ‌త్వానికి ఎయిర్ ఇండియా స‌లాం
Follow us on

Air India Express thanks Mallapuram residents :కేర‌ళ‌లోని కొళీకోడ్‌లో జ‌రిగిన ఘోర విమాన ప్ర‌మాదంలో 19 మంది ప్రాణాలు విడిచిన సంగ‌తి విధిత‌మే. అయితే విమానం ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆ ప్ర‌దేశానికి చేరుకుని ఎటువంటి భ‌య‌బ్రాంతుల‌కు గుర‌వ్వకుండా, స‌హాయ కార్య‌క్ర‌మాలు చేపట్టిన మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల‌పై దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. ప్ర‌స్తుతం క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో మ‌నుషులు ఎలా మారిపోయారో చూస్తున్నాం. ఇంట్లో కుటుంబ సభ్యులు చ‌నిపోతున్నా కూడా క‌నీసం ప‌ట్టించుకోని సంఘ‌ట‌న‌లు కోకొల్ల‌లు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా ప్రాణాలు కాపాడానికి ఎగ‌బ‌డి వెళ్లారు మ‌ల‌ప్పురం ప్ర‌జ‌లు. అంతేకాదు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డవారికి ర‌క్త దానం చేసేందుకు కూడా స్వ‌చ్చందంగా ముందుగా వ‌చ్చారు. వారు స‌కాలంలో స్పందించ‌డం వ‌ల‌న ఎన్నో ప్రాణాలు నిలిచాయి. ఈ క్ర‌మంలో ఎయిర్ ఇండియా భావోద్వేగ ట్వీట్ చేసింది. ‘మీ మంచి మ‌న‌సును సలాం, మీకు చాలా రుణ‌ప‌డి ఉంటాం’ అని పేర్కొంది. ఇది కేవ‌లం ధైర్యానికి సంకేతం మాత్ర‌మే కాదు, ప్రాణాల‌ను కాపాడ‌టానికి ముందుకు వ‌చ్చిన మాన‌వత్వం అని అభిప్రాయ‌ప‌డింది. కాగా కేర‌ళ పోలీసులు కూడా మ‌ల‌ప్పురం ప్ర‌జ‌ల ధైర్య‌సాహ‌సాల‌ను కొనియాడారు. క‌రోనా నేప‌థ్యంలో ఏకంగా వారి ఇళ్ల‌కే వెళ్లి సెల్యూట్ చేశారు.

Also Read : తెలంగాణ : రైతు బీమా పథకం అమలు కోసం రూ.1173.54 కోట్లు విడుదల