Tadipatri fight : తాడిపత్రిలో రాళ్ల దాడి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై కేసు నమోదు

అనంతపురం రాజకీయాల్లో హీట్ పెరిగింది. ముఖ్యంగా తాడిపత్రిలో పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో మొదలైన పోరు కాస్తా..ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణకు కారణమైంది.

Tadipatri fight : తాడిపత్రిలో రాళ్ల దాడి నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిలపై కేసు నమోదు

Updated on: Dec 25, 2020 | 11:07 AM

అనంతపురం రాజకీయాల్లో హీట్ పెరిగింది. ముఖ్యంగా తాడిపత్రిలో పాలక వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో మొదలైన పోరు కాస్తా..ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణకు కారణమైంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి భార్యకు వ్యతిరేకంగా కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో వివాదం తీవ్రమైంది. తన భార్యకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారు జేసీ బ్రదర్స్  అనుచరులన్న అనుమానంతో ఆయన తన అనుచరవర్గంతో కలిసి ఏకంగా జేసీ దివాకర్ రెడ్డి నివాసానికి వెళ్ళారు. అక్కడ కాసేపు హైడ్రామా నడిచింది. ఇంట్లో జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో..పెద్దారెడ్డి తన వర్గీయులతో వెనుదిరిగారు. ఈ క్రమంలో రాళ్ల దాడి జరిగింది. ఘటనలో పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురికి గాయాలయ్యాయి.

ఘటనకు సంబంధించి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు  జేసీ అస్మిత్ రెడ్డి సహా పలువురు అనుచరులపై సైక్షన్ 307, యస్.సి, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. రాళ్ల దాడిలో గాయపడిన మనోజ్ కుమార్ ఫిర్యాదుతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.

Also Read : 

Tadipatri fight : తాడిపత్రిలో హై అలర్ట్..అన్ని సెంటర్లలోనూ పికెటింగ్..నేడు కేసులు నమోదు చేసే ఛాన్స్

Variety marriage : వధువు పెళ్లి వద్దని వెళ్లిపోయింది…అతిథిలా వచ్చిన అమ్మాయి పెళ్లికూతురైంది

Drunk And Drive Tests : మందుబాబులకు హెచ్చరిక..నేటి నుంచి నగరంలో డ్రంక్ అండ్ టెస్టులు షురూ