Taapsee Pannu’s New Post: సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్న తాప్సీ పిక్‌.. పోస్టు వైరల్‌

Taapsee Pannu's New Post: ‘తాప్సీ ’ బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం ...

Taapsee Pannus New Post: సోషల్‌ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకున్న తాప్సీ పిక్‌.. పోస్టు వైరల్‌

Updated on: Jan 04, 2021 | 10:23 PM

Taapsee Pannu’s New Post: ‘తాప్సీ ’ బాలీవుడ్ లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ ముద్దుగుమ్మ తనకంటూ గుర్తింపు తెచ్చే పాత్రలనే ఎంచుకుంటుంది. ప్రస్తుతం ‘రష్మి రాకెట్‌’ అనే సినిమాలో నటిస్తోంది. అథ్లెట్ బ్యాక్‌ డ్రాప్‌లో కొనసాగే ఈ సినిమాలో రన్నర్‌ పాత్ర పోషిస్తోంది. తన గుర్తింపు కోసం పోరాడి అథ్లెట్‌ గా రాణించిన ఓ రన్నర్‌ పాత్రను తాప్సీ పోషిస్తోంది. ఆకర్ష్‌ ఖురానా డైరెక్షన్‌ వహిస్తున్న ఈ మూవీలో ప్రయాన్షు పెన్యులి తాప్సీ భర్తగా నటిస్తున్నారు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఫోటోలను తరచూ సోషల్‌ మీడియాలో పంచుకుంటున్న తాప్సీ.. తాజాగా మరో చిత్రాన్ని షేర్‌ చేశారు. ఈ పిక్‌ లో రౌండ్‌ సన్‌ గ్లాసెస్‌ పెట్టుకుని యాప్‌ కలర్‌ డ్రెస్‌ ఉంగరాల జట్టును వదిలేసి లైట్‌ క్లీవేజ్‌ షో చేస్తూ కనిపించారు. ఈ ఫోటోకు ఆత్మ విశ్వాసానికి సంబంధించిన కొటేషన్‌ సైతం జత చేశారు. ‘అందరితో పోల్చుకోవడం కాన్ఫిడెన్స్‌ కాదు.. అందరికన్న ముందున్నా ఎవ్వరితోనూ పోల్చుకోకపోవడమే కాన్ఫిరెన్స్‌’ అని కోట్‌ చేసింది ఈ బ్యూటీ.

నెటిజన్లను ఆకట్టుకున్న తాప్సీ పిక్‌.. పోస్టు చేసిన కొన్ని నిమిషాల్లోనే రెండు లక్షలకుపైగా లైకులు సాధించింది. కాగా, ప్రస్తుతం రష్మీ రాకెట్‌ చిత్రంలో నటిస్తున్న తాప్సీ చేతిలో.. లూప్‌ లాపెటా, హసీన్‌ దిల్రూబా సినిమాలు ఉన్నాయి. అదే విధంగా మళ్లీ తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అలివేలు వెంకటరమణ’ సినిమాలో నటించబోతోంది.

Varma Goa Shifts: రాం గోపాల్ వర్మ గోవాకు మకాం మార్చాడా? హైదరాబాద్‌ను వదలడానికి కారణం ఏంటి..