‘గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ వద్దు… టాలెంటెడ్ బ్యూటీ అన్న పేరే ముద్దు’..తాప్సీ కష్టానికి హ్యాట్సాప్ చెప్పిన తోటి నటీమణులు

|

Dec 17, 2020 | 12:31 PM

'గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ వద్దు... టాలెంటెడ్ బ్యూటీ అన్న పేరే ముద్దు' అనే స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నారు ముద్దుగుమ్మ తాప్సీ.  తొలి సినిమాతో చబ్బీ గర్ల్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన...

గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ వద్దు... టాలెంటెడ్ బ్యూటీ అన్న పేరే ముద్దు..తాప్సీ కష్టానికి హ్యాట్సాప్ చెప్పిన తోటి నటీమణులు
Follow us on

‘గ్లామర్ హీరోయిన్ ట్యాగ్ వద్దు… టాలెంటెడ్ బ్యూటీ అన్న పేరే ముద్దు’ అనే స్లోగన్‌తో ముందుకు వెళ్తున్నారు ముద్దుగుమ్మ తాప్సీ.  తొలి సినిమాతో చబ్బీ గర్ల్‌గా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్‌లో ఫుల్‌ బిజీ హీరోయిన్ అయ్యారు. జస్ట్ బిజీ హీరోయిన్ అన్న ట్యాగ్‌తో సరిపెట్టుకోవటం లేదు. చేసే ప్రతీ పాత్ర కోసం 100 శాతం కష్టం ప్రదర్శిస్తున్నారు.  హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా తాను సైతం  పోషించే పాత్రలు డిమాండ్‌ చేస్తే జిమ్‌లో చెమటలు చిందించడానికి వెనుకాడడం లేదు.  లేటెస్ట్‌గా తాప్సీ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రజెంట్ రష్మీ రాకెట్ సినిమాలో నటిస్తున్నారు తాప్సీ.. ఈ సినిమాలో అథ్లెట్‌గా కనిపిస్తున్నారీ బ్యూటీ. గుజరాత్‌కు చెందిన అథ్లెట్‌ రష్మీగా ఆమె కనిపించనున్నారు.

ఈ క్యారెక్టర్ లో ప్రొఫెషనల్ అథ్లెట్‌గా  కనిపించేందుకు అమ్మడు పడిన కష్టం అంతా ఇంతా కాదు. ట్రాక్‌ మీద రన్నర్‌గా రియల్‌ రన్నర్ ఫిట్‌నెస్ చూపించేందుకు జిమ్‌లో రోజుల తరబడి చెమటోడ్చారు.  పూర్తిస్థాయి అథ్లెట్‌గా కనిపించేందుకు న్యూట్రీషియనిస్టు, ఫిజియోథెరఫిస్టు, ట్రాక్‌ ట్రైనర్‌, అథ్లెటిక్‌ కోచ్‌.. సహకారాన్ని తీసుకున్నారు.  ఆ ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేస్తూ తాప్సీ పోస్ట్ చేసిన వీడియోకు సెల్రబిటీలు కూడా ఫిదా అయ్యారు. సమంత, కాజల్, భూమీ, శ్రియ లాంటి స్టార్ హీరోయిన్స్‌ కూడా తాప్సీకి హాట్సాఫ్ చెబుతూ కామెంట్లు చేశారు.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం